ప్రీవియస్ మూవీ `డియర్ కామ్రేడ్` నిరాశపరిచినా… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ అప్ కమింగ్ ఫిల్మ్ `వరల్డ్ ఫేమస్ లవర్` ట్రేడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా… ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ని అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` చిత్రాలతో బ్యాంకబుల్ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండ… జయాపజయాలతో సంబంధం లేకుండా యువతలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఫలితమే… `డియర్ కామ్రేడ్` ఆశించిన విజయం సాధించకపోయినా… `వరల్డ్ ఫేమస్ లవర్`కి ప్రి-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోందని ట్రేడ్ టాక్.
వాలెంటైన్స్ డే స్పెషల్ గా 2020 ఫిబ్రవరి 14న `వరల్డ్ ఫేమస్ లవర్` రిలీజ్ కానుంది. రాశీఖన్నా, కేథరిన్, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























