ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ తరుణ్.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలను అందుకుంటూ మిగిలిన యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే గత కొద్దికాలంగా మాత్రం సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. గత ఏడాది జులై లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘లవర్ ‘ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల చేయనున్నారు. డిసెంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుంది. జి.ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































