అర్ధరాత్రి ఆడవాళ్లు నడిరోడ్డుపై ధైర్యంగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని మనం గతకొన్ని సంవత్సరాలుగా వింటూనే వున్నాం. ఇక ముందు కూడా వింటూనే ఉంటాం కానీ ఆ రోజు మాత్రం రాదు అనేది మాత్రం కొన్ని సంఘటనలను చూస్తుంటే అర్ధమవుతుంది. దేశం రోజు రోజుకి ఎంతో అభివృద్ధి అవుతున్నా.. టెక్నాలజీ రోజు రోజుకి ఎంతో పెరుగుతున్నా.. ఆడవాళ్లకు అండగా ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రోడ్డుపై ఆడవాళ్ళు తిరగాలంటేనే భయపడే రోజులు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడున్నరోజులని బట్టి ఎవరో వస్తారు..? కాపాడతారు అని అనుకోవడం మన అమాయకత్వం. కళ్ళ ముందే ఘటన జరుగుతున్నా మనకెందుకులే అని పట్టించుకోకుండా.. ఎవరి పని వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో మన ఆడవాళ్లను మనమే కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలోనే కింద ఇచ్చిన నెంబర్లను మీకు ఇంట్లో ఆడవాళ్లకు.. మీకు తెలిసిన వాళ్లకు కూడా పంపి వారి ఫోన్ లో సేవ్ చేసుకోమని చెప్పండి. ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు బ్లాంక్ మెసేజ్ కానీ మిస్డ్ కాల్ కానీ ఇస్తే మీరు వున్న లొకేషన్ ను పోలీస్ లు వెంటనే గుర్తించి హెల్ప్ చేస్తారు. ఏదిఏమైనా ఇవన్నీ తాత్కాలిక పరిష్కారాలే తప్పా.. వీటికి పర్మినెంట్ సొల్యూషన్ మాత్రం అనేది ఉండదన్నది అందరికీ తెలిసిన రహస్యమే..

Dear all,
DONT LOOSE YOUR CONFIDENCE / YOUR CONFIDENCE IS YOUR SHIELD.
Please #Dial100 – #DialYourPolice
WhatsApp at District Wise Police WhatsApp numbers, if you suspect any danger / threat, * sharing your location. pic.twitter.com/62SAlf796z— DGP TELANGANA POLICE (@TelanganaDGP) November 28, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























