`క్రిష్` సిరీస్… బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కి `సూపర్ హీరో` ఇమేజ్ ని తీసుకువచ్చిన ప్రాంఛైజీ. హృతిక్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ తెరకెక్కించిన ఈ సిరీస్ లోని మూడు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. `కోయి మిల్ గయా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013)… ఇలా మూడు సార్లూ దేశ వ్యాప్తంగా అలరించిన హృతిక్… మరోసారి `క్రిష్` పాత్రలో సందడి చేయనున్నాడు. ఈ సీక్వెల్ కి కూడా రాకేష్ రోషన్ నే దర్శకత్వం వహించనున్నాడు. కాగా… కథానాయకుడిగా హృతిక్ నటించిన తొలి చిత్రం `కహో నా ప్యార్ హై` (దీనికి కూడా రాకేష్ రోషన్ దర్శకుడు) ఏ తేదిన (జనవరి 14) విడుదలైందో సరిగ్గా అదే రోజున `క్రిష్ 4` ప్రారంభం కానుందని బాలీవుడ్ టాక్. సో… కెరీర్ రెండు దశాబ్దాలు పూర్తిచేసుకుంటున్న రోజున ప్రారంభం కానున్న`క్రిష్ 4` హృతిక్ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ ఏడాదిలో హృతిక్ నుంచి వచ్చిన `సూపర్ 30`, `వార్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























