`యన్టీఆర్ మహానాయకుడు` చిత్రంలో ముఖ్యమంత్రిగా దర్శనమిచ్చిన నటసింహ నందమూరి బాలకృష్ణ… త్వరలో మరో సినిమాలోనూ సీఎమ్ గా కనిపించబోతున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, రాజకీయాల చుట్టూ తిరిగే కథగా కాకుండా… ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. త్వరలోనే బాలయ్య పాత్రపై మరింత క్లారిటీ వస్తుంది.
డిసెంబర్ 9న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న బాలయ్య, బోయపాటి చిత్రం… జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. కాగా, వచ్చే ఏడాది వేసవి చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: