‘బాహుబలి’… దక్షిణాది సినిమాకి కొత్త దారి చూపించిన తెలుగు చిత్రం. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేర్లతో రెండు భాగాలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్… ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు… రెండో భాగమైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే… భారతీయ చిత్ర పరిశ్రమలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచింది. అంతర్జాతీయ స్థాయిలో విజయఢంకా మోగించిన ఈ అద్భుత జానపద చిత్రరాజాన్ని… ఇప్పుడు రి-రిలీజ్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ సిరీస్‌ను… ఇప్పుడు ఒకే భాగంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇంటర్వెల్ వరకు ఒక భాగాన్ని, ఇంటర్వెల్ తరువాత మరో భాగాన్ని డిజైన్ చేస్తున్నారట. అలాగే`కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?` అనే క్వశ్చనింగ్ ఎపిసోడ్‌తో ఇంట్రవెల్ బ్యాంగ్ ని ప్లాన్ చేస్తున్నారని వినికిడి. దాదాపు ఐదున్నర గంటల నిడివి ఉన్న ఈ రెండు భాగాలను… మూడు గంటలకు కుదించే విధంగా ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. పెద్దగా ప్రాధాన్యత లేని సన్నివేశాలతో పాటు కొన్ని పాటలను తొలగించడమే కాకుండా… అవసరమైన చోట అదనపు ఆకర్షణల కోసం కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేసారని తెలుస్తోంది. మరి… తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సింగిల్ పార్ట్ ‘బాహుబలి’… ‘రి-రిలీజ్`లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
త్వరలోనే `బాహుబలి` రి-రిలీజ్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























