తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని… తెలుగువారికి కూడా సుపరిచితుడే. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘శంభో శివ శంభో’(2010), నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెండాపై కపిరాజు’(2014)… సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందాయి. ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే, మరోవైపు నటుడిగానూ పలు తమిళ చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్… ఇప్పుడు నటుడిగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధపడుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ కాప్ స్టోరీలో… సముద్రఖని ఓ కీలకపాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ‘శంభో శివ శంభో’ చిత్రం కోసం రవితేజను డైరెక్ట్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… ఇప్పుడు అదే రవితేజతో వెండితెరను పంచుకోనుండడం విశేషం. మరి… అప్పుడు దర్శకుడిగా రవితేజకు అచ్చొచ్చిన సముద్రఖని… ఇప్పుడు నటుడిగా కూడా కలిసొస్తాడేమో చూడాలి.
కాగా… దర్శకధీరుడు యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’లోనూ సముద్రఖని ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్`అల వైకుంఠపురములో`లోనూ విలన్‌గా నటిస్తున్నాడని టాక్. సో… 2020లో మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లతో తెలుగునాట నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడన్నమాట సముద్రఖని.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























