రజనీకాంత్ అరుదైన గౌరవం – ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ

Rajinikanth Honored With A Prestigious Award,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Awards Received by Rajinikanth,Superstar Rajinikanth Prestigious Award,Rajinikanth Latest News

తన విలక్షణమైన నటనతో.. డిఫరెంట్ మ్యానరిజమ్స్, స్టైల్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింవ అవసరం లేదు సినీ లవర్స్ కి. ఇక ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అయన కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆయనకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్స‌వాలు ప్ర‌తి ఏడాది గోవాలో ఘనంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది న‌వంబ‌ర్ 20 నుండి 28వ‌ర‌కు 50వ ఐఫా వేడుక‌లు గోవాలో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో 250కి పైగా సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకోనున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను సత్కరించనున్నారు.

ఇక ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార ప్ర‌సారశాఖ మంత్రి (బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట‌ర్) ప్ర‌కాష్ జ‌వ‌దేవ‌క‌ర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. కొన్ని ద‌శాబ్దాలుగా త‌న న‌ట‌న‌తో ఇండియ‌న్ సినిమాకు ర‌జనీకాంత్ చేసిన సేవ‌ల‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించ‌డం చాలా ఆనందంగా ఉంద‌నితెలిపారు. త‌న‌కి ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌ గౌర‌వం అందించినందుకు ర‌జ‌నీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.