మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మూవీస్ దర్శకుడు గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ మూవీ కి రంగం సిద్ధమైంది. డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్ మూవీస్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యంలో గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ హీరోగా ఎంటర్ టైనర్ మూవీ #RT 66 రూపొందనుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటించిన బలుపు మూవీ ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరోసారి జంటగా నటించి ఈ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు దర్శకుడు గోపీచంద్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీఅలరించనుందని , నవంబర్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. హీరో రవితేజ ప్రస్తుతం VI ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కోరాజా లో నటిస్తున్నారు. డిస్కో రాజా మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. #RT 66 మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























