‘కింగ్’ నాగార్జున, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ ఒకటి. ముఖ్యంగా…`శివ` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత సరైన విజయం లేని నాగ్ కి ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’ సక్సెస్ మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇక టైటిల్ రోల్లో మీనా నటించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శ్రీకాంత్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, సుధ, అన్నపూర్ణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిగ్గజ రచయిత వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు… స్వరవాణి కీరవాణి వీనులవిందైన బాణీలు అందించారు. “నువ్వు మల్లెతీగ”, “ఆ ఒడ్డు ఈ ఒడ్డు”, “తస్సా చెక్కా”, “ఉమ్మ కావాలి”, “మండూరి”, “పరువాల కోడి”… ఇలా ప్రతీ పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. నాగార్జునకు అచ్చొచ్చిన నిర్మాతల్లో ఒకరైన వి.దొరస్వామిరాజు (వి.ఎం.సి.ప్రొడక్షన్స్ అధినేత) నిర్మించిన ఈ చిత్రం… మంచి విజయాన్ని నమోదు చేసింది. 1992 అక్టోబర్ 30న విడుదలైన ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం’… నేటితో 27 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: