నిన్న దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ పెద్ద ట్రీటే ఇచ్చింది. పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు, ఫస్ట్ లుక్ లు, ట్రయిలర్ లు రిలీజ్ చేశారు. ఇక ఆ అప్ డేట్స్ ఏంటో ఒక లుక్కేద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం దీపావళి నాడు బాంబ్ ను వేస్తున్నానని చెప్పినట్టే చేసాడు వర్మ. నిన్న ఉదయం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. ఇక ఈ ట్రయిలర్ కాస్త వివాదాస్పదంగానే ఉంది.
On this festival occasion, i am happy to announce that i have started my production house “MM Arts” and here are the details. Need all ur love and blessings for this new journey of mine ❤️#HappyDiwali everyone 😍#MMArts pic.twitter.com/chRL9sYCwH
— MM*🙏🏻❤️ (@HeroManoj1) October 27, 2019
ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా తన కొత్త సినిమా గురించిన అప్ డేట్ ఇచ్చాడు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు తన కొత్త సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. మరి ఆ వివరాలు తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకూ ఆగాల్సిందే.

ఇక ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు కూడా దీపావళి సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ నిన్న ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నవంబర్ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెద్ద సెట్ వేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ట్వీట్ లో తెలిపారు.
#Prabhas20Update for all the #DieHardFans🤘 #Prabhas20 new schedule will begin in November. Pre-production work happening in full swing for a huge set in Hyderabad.#Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations #HappyDiwali pic.twitter.com/xGimsdtXNw
— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2019
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా రష్మిక మందన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేనూ నా ఫ్యామిలీ నన్ను చూడటానికి వచ్చిన 101 నవ పెళ్లికొడుకుని ఎలా హ్యాండిల్ చేస్తామో అంటూ.. ఈ పోస్టర్ ను పోస్ట్ చేసింది.
‘How to get a guy 101.’ This me and my family will teach you on the 12 of jan 2020 – stay tuned 😉
Team #SarileruNeekevvaru wishes you a very Happy #Diwali 🎆🎇💥@urstrulyMahesh @AnilRavipudi@AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @AKentsOfficial @SVC_official @GMBents ♥️✨ pic.twitter.com/FTAFOvv79g
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2019
రాహుల్ విజయ్ హీరో గా ‘కాలేజ్ కుమార్’ మూవీ తెరకెక్కుతుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























