సంక్రాంతి అనగానే పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ కళ్ళముందు కదలాడతాయి. అంతేకాదు… ఈ సీజన్ లోనే పలువురు స్టార్స్ రీ-ఎంట్రీ ఇచ్చిన వైనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కళాభినేత్రి వాణిశ్రీ, మెగాస్టార్ చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ సంక్రాంతి సమయంలోనే రీ-ఎంట్రీ ఇచ్చి ఘనవిజయాలు అందుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో సూపర్ స్టార్ కూడా ముగ్గుల పండక్కి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ స్టార్ మరెవరో కాదు… లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. `నాయుడమ్మ` (2006) తరువాత చిత్రపరిశ్రమకు దూరమైన మన రాములమ్మ… 2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు`తో వెండితెరపై మరోసారి వెలుగులు పంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి… ‘దేవుడు మావయ్య’(1981) అనంతరం ఎనిమిదేళ్ళ గ్యాప్ తరువాత ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’(1989)తో బ్లాక్‌బస్టర్ రీ-ఎంట్రీ ఇచ్చిన వాణిశ్రీ… ‘శంకర్‌దాదా జిందాబాద్’(2007) తరువాత పదేళ్ళ విరామం అనంతరం ‘ఖైదీ నంబర్ 150’ (2017)తో సెన్సేషనల్ రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తరహాలో విజయశాంతి కూడా `సరిలేరు నీకెవ్వరు`తో బ్లాక్‌బస్టర్ రీ-ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
కొసమెరుపేంటంటే… వాణిశ్రీ రీ-ఎంట్రీ ఫిల్మ్ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’లో చిరు, విజయశాంతి జంటగా నటించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































