సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. E 4 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మూవీ గిరీశాయి దర్శకత్వంలో ఆదిత్య వర్మ గా రూపొందింది. ఆదిత్య వర్మ మూవీ తో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా కోలీవుడ్ కు పరిచయమవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆదిత్య వర్మ మూవీ లో బనిత సింగ్, ప్రియా ఆనంద్ కథానాయికలు. రధాన్ సంగీతం అందించారు. నవంబర్ 8వ తేదీన రిలీజ్ కానున్న ఆదిత్య వర్మ మూవీ ఆడియో లాంచ్ నిన్న (21 వ తేదీ ) చెన్నై లో జరిగింది. ఆ వేడుకలో E 4 ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత ముఖేష్ మెహతా మాట్లాడుతూ .. తండ్రీ తనయులు (విక్రమ్ , ధృవ్ విక్రమ్ )తో ఒక మల్టీ స్టారర్ మూవీ నిర్మించనున్నట్టు ప్రకటించారు. హీరో విక్రమ్ ప్రస్తుతం ధృవ నక్షత్రం , మహావీర్ కర్ణ , పొన్నియిన్ సెల్వన్ మూవీస్ లో నటిస్తున్నారు. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకొనే విక్రమ్ తన 58న వ మూవీ లో 25 గెటప్స్ లో కనిపించనున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























