స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘సామజవరగమన’ సాంగ్ రిలీజ్ చేయగా.. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ గా నిలుస్తాయట. అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ ఒక 10 నిమిషాలపాటు ఉంటాయట. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ ఎమోషనల్ సీన్స్ ను త్రివిక్రమ్ హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించాడని.. ప్రతి ఒక్కరి మనసులకు ఆ సీన్స్ కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. మరి నిజంగానే ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ చాలా జీనియస్. చూద్దాం ఈ సినిమాలో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో.
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
మరి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























