దళపతి వర్సెస్ మక్కళ్‌ సెల్వన్‌

It's A Battle between Vijay and Vijay Sethupathi,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vijay Vs Vijay Sethupathi,Vijay Sethupathi Pivotal Role in Thalapathy 64,Thalapathy 64 Cast Details

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మక్కళ్‌ సెల్వన్ విజయ సేతుపతి కూడా అతి తక్కువ కాలంలోనే.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఓ రేంజ్ కు వెళ్ళాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే.. వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటది. ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా.. ఈ ఊహ నిజం కాబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ తన తర్వాత సినిమా చేయనున్నాడు. ఎక్స్‌బీ ఫిలింస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవీర్‌ బ్రింటో నిర్మించనున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారాఅద్వాని హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలోనే విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అది కూడా విలన్ పాత్రలో నటిస్తున్నాడట. ప్రస్తుతం ఫ్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబరు తొలివారం నుంచి ఈ సంచలన చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో బిగిల్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళికి తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.