తెలుగువారికి సంక్రాంతి ఎలాగో… తమిళులకు పొంగల్ అలాగా. అందుకే… పొంగల్ టైమ్ లో వచ్చే మూవీస్ అంటే అక్కడ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో… 2020 పొంగల్ సందర్భంగా కోలీవుడ్‌లో మూడు ఆసక్తికరమైన చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ రజినీకాంత్, పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార నాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2020 పొంగల్‌కి రిలీజ్ కానుంది. ఇక ఇదే సమయంలో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నూతన దర్శకుడు ఆనందన్ రూపొందిస్తున్న ‘ఇరుంబుతిరై 2’ కూడా రిలీజ్ కానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అలాగే… కార్తీ హీరోగా జీతూ జోసెఫ్ (మలయాళ ‘దృశ్యం’ ఫేమ్) రూపొందిస్తున్న పేరు నిర్ణయించని ఫ్యామిలీ థ్రిల్లర్ కూడా పొంగల్నే టార్గెట్ చేసుకుందని సమాచారం.
మరి… ఈ మూడు చిత్రాలలో దేనికి ఆదరణ దక్కుతుందో చూడాలి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























