మొత్తానికి ఆది సినిమా రిలీజ్ కు ముహూర్తం కుదిరింది. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు మాత్రం ఇంత వరకూ ముహూర్తం కుదరలేదు. గతంలో ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కాని అది కుదరలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ లో విడుదల అన్నారు.. అది కూడా అవ్వలేదు. ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సాషా ఛెత్రి హీరోయిన్ గా నటిస్తుండగా.. కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆదికి ఈ సినిమాఎంత వరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























