నార్త్ లో ‘సాహో’ ప్రభంజనం – ఆ రెండు రాష్టాల్లో రికార్డ్స్

Saaho Continues To Break Records In Other States,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Collections,Saaho Movie Collections,Saaho Telugu Movie Collections,Saaho Box Office Collections,Saaho Movie Areawise Collections,Saaho Telugu Movie Worldwide Collections

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహోకు మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి కలెక్షన్సే రాబట్టింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టినే కలెక్షన్సే ఉదాహరణగా చెప్పొచ్చు. సాహో హిందీ వర్షన్ తెలుగుకు మించి 150కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలలో సాహో రికార్డు కలెక్షన్స్ సాధించిందని సమాచారం. ఒరిస్సా రాష్ట్రంలో బాహుబలి 2 తరువాత అంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సాహో నిలిచింది. కాగా బీహార్ లో కూడా సాహో చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. బీహార్ లో సాహో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుందట. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ సైతం వెనక్కి నెట్టి 6వ స్థానంలో నిలిచింది.

మరి గతంలో సుజీత్ కూడా బీహార్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని.. తను కనుక ఇక్కడ పుట్టుంటే గుడి కట్టేవారని ఓ బీహార్ అభిమాని తనతో అన్నట్టు సుజీత్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటది. మరి అక్కడ ఇలాంటి రెస్పాన్స్ రావడంలో తప్పులేదు కదా మరి.

ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నసంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. జాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.