విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. నచ్చావులే సినిమా నుండి… మొన్న వచ్చిన అదుగో సినిమా వరకూ ప్రతి ఒక్క స్టోరీ విభిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగాత్మక మూవీ ఆవిరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈసారి కూడా ఏదో కొత్త ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయన్నునారు. ఈ విషయాన్నీ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
Ravi Babu’s #AaviriTeaser on September 28th. #AaviriTeaserOn28thSept#NehaChauhan @flyingfrogsoffl #DilRaju @svc_official
October 2019 Release. pic.twitter.com/eQl0fEMzcx
— Sri Venkateswara Creations (@SVC_official) September 26, 2019
కాగా ఈ సినిమాలో రవిబాబు, నేహా చౌహాన్, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణ లో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
మరి ‘అవును’ తరువాత ఆ స్థాయి సక్సెస్ ఇప్పటివరకూ రాలేదని చెప్పవచు. ఇక ఇటీవలే అదుగో సినిమాతో ప్రయోగం చేసినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరి కాస్త వెనుకపడిన రవిబాబుకి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























