సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇటలీ రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ లో భాగంగానే టీమ్ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబును సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ విలన్ గా అలాగే డిఫరెంట్ పాత్రలతో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జగ్గూభాయ్ అయితే విలన్ గా కరెక్ట్ గా సరిపోతాడని భావించి అతనిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























