నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రివేంజ్ ఎంటర్ టైనర్ లో… ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషించాడు. కాగా… ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమాతో ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా పరిచయం కానుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… గతంలో నాని చిత్రాలతో పరిచయమైన దక్షిణాది కథానాయికలు… ఆ యా సినిమాలకు కలిసొచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘అలా మొదలైంది’తో నిత్యా మీనన్, ‘ఎవడే సుబ్రమణ్యం’తో మాళవికా నాయర్, ‘జెంటిల్‌మన్’తో నివేదా థామస్, ‘మజ్ను’తో అను ఇమ్మాన్యుయేల్, ‘జెర్సీ’ చిత్రంతో శ్రద్ధా శ్రీనాథ్’… ఇలా దక్షిణాదికి చెందిన ఈ కథానాయికలంతా నాని హీరోగా నటించిన చిత్రాలతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాలతోనే మెమరబుల్ హిట్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో… మరో సౌత్ ఇండియన్ బ్యూటీ ప్రియాంక డెబ్యూ ఫిలిమ్ గా వస్తున్న నాని ‘గ్యాంగ్ లీడర్’ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























