నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రమణ్యం సినిమా తో టాలీవుడ్ లో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ ను పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఆ సినిమా తరువాత నాగ్ అశ్విన్ తో విజయ్ దేవరకొండ చేయనున్నాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ తో ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత మహానటి సినిమాలో కూడా నటించాడు. అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి వెళుతోంది. అంతే కాదు స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే రెండుసార్లు హిట్ అందుకున్న వీరి కాంబినేషన్ మూడోసారి కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























