ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న వ్యక్తి సినిమా తీస్తే ఎలా ఉంటుందో నాగబంధంతో తెలుస్తుంది – విరాట్ కర్ణ

Nagabandham Will Show What Happens When a Producer and Distributor Makes a Film says Virat Karna

‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తులు, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. ‘నాగబంధం’ సినిమాకు మీరందరూ చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్, ఎగ్జైట్‌మెంట్ చూసి చాలా ఆనందంగా ఉంది. సినిమా అనేది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. మా దర్శకుడు అభిషేక్ గారి విజన్ ఎంత గొప్పదో ట్రైలర్‌లోనే చూశారు. ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న వ్యక్తి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో తెలుస్తుంది. మన పురాతన ఆలయాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చరిత్రను నెక్స్ట్ జనరేషన్‌కు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. అభిషేక్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నిశిత కిషోర్ గారు ఎంతో ఓర్పుతో, నమ్మకంతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

అలాగే రథయాత్ర ద్వారా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ రథయాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘మా ఊరికి ఎప్పుడు వస్తుంది?’ అని చాలామంది అడుగుతున్నారు. అది ఇంకా కొనసాగుతోంది. కొత్తవాడినైనా ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి పని చేశాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఈ బాధ్యతను నా భుజాలపై పెట్టిన అభిషేక్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఎప్పుడూ నాపై ఒత్తిడి పెట్టలేదు. ఆ ఒత్తిడంతా తనే తీసుకుని, నేను కేవలం పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టేలా చేశారు. వర్క్‌షాప్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సహా ప్రతి విషయంలోనూ ఆయన నాకు అండగా నిలిచారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.”

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.