నార్నె నితిన్ 6వ సినిమా… సర్వైవల్ థ్రిల్లర్ గా

Young Hero Narne Nithiin’s 6th Film Officially Announced

యంగ్ హీరో నార్నే నితిన్ తన గత మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా యూత్‌ఫు, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేసిన నార్నే నితిన్, తన ఆరవ చిత్రం కోసం బలమైన కథాంశం ఉన్న కథను ఎంచుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. యు సుహాస్ బాబు దర్శకత్వంలో, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రం (#NN6),  బొగ్గు గనుల నేపథ్యంలో సాగే సర్వైవల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మేకర్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. విస్తారమైన భూగర్భ బొగ్గు గనుల్లో చీకటి, దుమ్ము, పొగల మధ్య సాగే ప్రపంచాన్ని ఇందులో ప్రజెంట్ చేశారు. ఆ కఠిన పరిస్థితుల నడుమ నార్నే నితిన్ కనిపించే తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మైనర్ హెల్మెట్, వర్కర్ దుస్తుల్లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించిన నార్నే నితిన్ పూర్తిగా కొత్త అవతార్‌లో ఆకట్టుకున్నారు. ఆయన కళ్లలో కనిపించే తీవ్రత, హావభావాలు, కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగే పాత్రను సూచిస్తున్నాయి. వందలాది మంది కార్మికుల మధ్య, ఆయన ప్రయాణం ప్రత్యేకంగా ఉండబోతుందనే సంకేతాలను వీడియో అందించింది.

ఈ ప్రకటనతోనే సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచిన #NN6 చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.