NBK 112 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Official Launch Date Confirmed for NBK112

నటసింహం, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #NBK112 పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్న లైనప్‌లలో ఇదొకటి. బాలకృష్ణ పవర్‌ఫుల్ మాస్ ఇమేజ్, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది.ఆంధ్రప్రదేశ్, అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జూన్ 25న ఉదయం 9 గంటల నుండి ఈ సినిమా లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది.

ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన మంత్రులు నారా లోకేష్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర యూనిట్‌కు బ్లెస్సింగ్స్ అందించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.బాలయ్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో కొరటాల శివ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఇన్సైడ్ టాక్. జూన్ 25న ఈ పూజా కార్యక్రమాలతో పాటు సినిమాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.