హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం మూవీ సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. తెలుగులో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ పూర్తిగా US లో
చిత్రీకరణ జరుపుకొనడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సియోటెల్ లో షూటింగ్ ముగించుకున్న హీరోయిన్ అనుష్క ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాజువల్ డ్రెస్ తో , మేకప్ లేకుండా , అందంగా ఉన్న అనుష్కను ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్ చేశారు. నిశ్శబ్దం మూవీ తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషలలో రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న నిశ్శబ్దం మూవీ టీజర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ మూవీ భాగమతి తరువాత అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























