ప్రభాస్, అనుష్క ఈ టాపిక్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్కే. బిల్లా సినిమా నుండి బాహుబలి వరకూ దాదాపు 10 ఏళ్ళ స్నేహం వీరిది. కానీ వీరిది స్నేహం కాదు.. అంతకుమించి ఏదో ఉందని అప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు కాస్తా వెరీ పెళ్లి వరకూ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కి, అటు అనుష్క కి ప్రెస్ మీట్లలో వారి రిలేషన్ పై పలు ప్రశ్నలు ఎదురవ్వడం.. వాళ్ళు కూడా ఓపికగా సమాధానం చెప్పడం చూస్తూనే వున్నాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ ప్రస్తుతం `సాహో` ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి విదితమే. ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతుండడంతో అన్ని ప్రాంతాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. పలు ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే ఈ ఇంటర్వ్యూ ల్లో కూడా అనుష్క గురించి పలు ప్రశ్నలే అడిగారు. ఒకానొక సందర్భంలో అనుష్క ను పెళ్లి చేసుకోమని చెప్తా అని ప్రభాస్ అన్నాడంటే.. ఈ ప్రశ్నలతో ఎంత విసిగిపోయాడో అర్ధం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రభాస్ ను ఓ విలేకరి తెలివిగా రూమర్స్ గురించి కాకుండా మీకు అనుష్కలో నచ్చనిది ఏంటని అడుగగా.. దానికి వెంటనే ప్రభాస్ ఆమె ఫోన్ కాల్స్‌కు సరిగ్గా రెస్పాండ్ ఎవ్వదు.. ఎన్ని సార్లు చేసినా ఫోన్ మాత్రం పిక్ చేయదు.. నేనే కాదు చాలా మంది నుండి అనుష్కపై ఇదే కంప్లైంట్ ఉంది అని చెప్పాడు. మరి ఎప్పుడూ పర్సనల్ విషయాలు కాకుండా ఇలాంటివి అడిగితే ఆన్సర్ చేయడానికి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























