ప్రస్తుతం ప్రభాస్ సాహో ప్రమోషన్ లో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ రేంజ్ సాహో సినిమాతో ఆ రేంజ్ మరింత పెరిగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన తర్వాత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే జాను అనే టైటిల్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. 1960-70 మధ్య కాలంలో సాగే కథతో ఈ సినిమా నడుస్తుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ యూరప్ లో జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ప్రభాస్ రాధా కృష్ణ సినిమా తర్వాత తను చేయబోయే సినిమా గురించి కూడా చెప్పేసాడు. సాహో ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రభాస్ తన తర్వాత సినిమా శ్రీకాంత్ అడ్డాలతో ఉంటుందని.. ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తానని చెప్పాడు. మొత్తానికి ప్రభాస్ కాస్త రిలాక్స్డ్ గా వుండే జోనర్ లో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. మరి ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























