పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!

Latest News About #SSMB27 is a Rumour, Latest Telugu Movies News, Mahesh Babu And Parasuram Movie is Completely Baseless, Mahesh Babu New Movie News, Mahesh Babu New Movie Updates, Mahesh Babu Next Film Updates, Superstar Mahesh Babu Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Latest Updates

రీసెంట్ గా మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మహేష్ బాబు తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పరుశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మరియు కొరటాల శివ ఈ సినిమాను నిర్మిస్తున్నారని.. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడని.. వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని… ఇవన్నీ ఫేక్ న్యూస్ అని అంటున్నారు

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తుండగా.. ఆ సినిమా అయిపోయిన తర్వాత తన తర్వాత సినిమాపై క్లారిటీ ఇవ్వనున్నాడట మహేష్. మరి ఎంతో మంది డైరెక్టర్లు మహేష్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారు.. వారిలో తన తర్వాత సినిమా చేసే అవకాశం మహేష్ ఎవరికి ఇస్తాడో చూద్దాం..!

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.