‘గోకులంలో సీత’… కళ్యాణ్‌ను కాస్త పవన్ కళ్యాణ్గా మార్చిన సినిమా. అంతేకాదు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో రెండో చిత్రంగా విడుదలై… అతనికి తొలి విజయాన్ని అందించిందీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తమిళ చిత్రం ‘గోకులత్తిల్ సీతై’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. రాశి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో… హరీష్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, సుధాకర్, ప్రియ, శ్రీహరి, రక్ష తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర రచించిన పాటలకు… వీనుల విందైన బాణీలు అందించారు సంగీత దర్శకుడు కోటి. ముఖ్యంగా… “గోకులకృష్ణ గోపాలకృష్ణ”, “ఊ… అంది పిల్లా”, “పోద్దేరాని లోకం నీది”, “అందాల సీమలోని”, “ప్రేమ ప్రేమ ఓ ప్రేమ” వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. శ్రీ శ్రీ చిత్ర పతాకంపై బి.శ్రీనివాసరాజు నిర్మించిన ఈ సినిమా… చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. అంతేకాదు… చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన… పవన్ ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. 1997 ఆగస్టు 22న విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘గోకులంలో సీత’… నేటితో 22 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: