సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ సాహో మూవీ లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. సాహో మూవీ లోని మూడవ సాంగ్ బ్యాడ్ బాయ్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ను బాద్ షా , నీతి మోహన్ ఆలపించారు. రచన, సంగీతం బాద్ షా అందించిన బ్యాడ్ బాయ్ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్యాడ్ బాయ్ సాంగ్ లో నటించిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ .. తెలుగు లో తనకు ఫస్ట్ సాంగ్ అని, ఆస్ట్రియా లో రెండున్నర రోజులలో చిత్రీకరించారని, టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ తో నటించడం గ్రేట్ అని, సాంగ్ బాగా వచ్చిందని అన్నారు. తాను తెలుగు లో నటించిన ఫస్ట్ సాంగ్ బియాండ్ ది సీన్ వీడియో ను జాక్విలిన్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తాను బ్యాడ్ బాయ్ సాంగ్ కు ప్రిపేర్ అవడం చూపారు. వీడియో కు అద్భుతమైన స్పందన వచ్చిందని, వీడియో ను చూసిన వారందరికీ థ్యాంక్స్ అని జాక్విలిన్ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: