మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 22న ప్రారంభం కానుంది. నవంబర్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఈ సినిమా నక్సలిజమ్ నేపథ్యంలో సాగుతుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు… చిరు ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఓ పాత్ర నక్సలైట్‌గా ఉంటుందని… ఆచార్య పేరుతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తారని టాక్. ఇక మరో పాత్ర ఎన్నారైగా ఉంటుందని… గోవింద్ అనే స్క్రీన్ నేమ్ ఉంటుందని సమాచారం. ఈ పాత్ర యంగ్ అండ్ డైనమిక్‌గా ఉంటుందని తెలిసింది. మరి… కొత్త తరహా పాత్రల్లో చిరు ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలంటే 2020 ఉగాది వరకు వేచి చూడాల్సిందే.
[youtube_video videoid=Q0WrJ6epCl4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: