సైబర్ క్రైం నేపథ్యంలో నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉన్నాయి. దానికి తోడు ఓ మంచి స్టోరీ లైన్ తో రావడం.. హీరో కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా యాక్షన్స్ చేయడం ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకా ప్రముఖ కమెడియన్లు వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ చిత్రంలో కామెడీ పండించనున్నారు. అటు యాక్షన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా కుదరడంతో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
కాగా ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంకా శివాంగి, సుమన్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఔరోస్ అవతార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. జయపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఇక ఇదే ఆగష్ట్ 9 వ తేదీన పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మన్మథుడు 2, కథనం, కురుక్షేత్రం, కొబ్బరి మట్ట ఇలా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మన్మథుడు 2 సినిమా నే పెద్దది, కురుక్షేత్రం సినిమా పెద్దది అయినా డబ్బింగ్ సినిమా.. కాబట్టి అశ్వమేథం సినిమాకు చాలా అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో..
[youtube_video videoid=b1g0PLeomCQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























