‘క్రిష్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్. తాజాగా `సూపర్ 30`తో పలకరించిన ఈ టాలెంటెడ్ స్టార్… త్వరలో ఓ రీమేక్ మూవీ చేయబోతున్నాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే… అమితాబ్, హేమమాలిని జంటగా నటించిన ‘సత్తే పే సత్తా’ (1982) ని అదే పేరుతో పర్హా ఖాన్ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మించనున్న ఈ చిత్రంలో బిగ్ బి పాత్రలో హృతిక్ నటించనుండగా… హేమమాలిని పాత్రలో దీపికా పదుకొణేని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ రీమేక్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. అమితాబ్ చిత్రాల రీమేక్స్‌లో హృతిక్ నటించడం ఇది రెండోసారి. గతంలో ‘అగ్నిపథ్’ని రీమేక్ చేసి విజయం అందుకున్నాడు హృతిక్. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ‘సత్తే పే సత్తా’ రీమేక్‌తోనూ అలరిస్తాడేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=5nWJNLqCB8I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























