మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు డ్యూయల్ రోల్లో దర్శనమివ్వనున్నారని టాక్. అందులో ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ఎన్నారై పాత్ర అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిమ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… ఈ చిత్రంలో అందాల నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కథానాయికగా నటించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే చిరు – కొరటాల శివ కాంబినేషన్ మూవీలో ఐష్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
అన్నట్టు… చిరు తాజా చిత్రం ‘సైరా’లో ఐష్ మావయ్య, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
[youtube_video videoid=Yz7SoitXAeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























