విజయ్ కోసం సుకుమార్ ఎమోషనల్ స్టోరీ..!

2019 Latest Telugu Movie News, Sukumar Creates An Emotional Story For Vijay Deverakonda, Sukumar next movie with Vijay Deverakonda, Sukumar to direct Emotional Story, Vijay Deverakonda got chance to work with Sukumar, Vijay Deverakonda next movie updates, Vijay Deverakonda latest movie news, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Sukumar Creates An Emotional Story For Vijay Deverakonda

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ డైరెక్టర్లు సైతం విజయ్ తో సినిమా తీయాలని ఉంది అన్న రేంజ్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవన్ తో మరో సినిమా చేస్తున్నాడు విజయ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. సుకుమార్-విజయ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కోసం సుకుమార్ ఓ ఎమోషనల్ స్టోరీని సిద్దం చేశాడట.. ఆ కథను విజయ్ కు వినిపించాడట.. విజయ్ కు కూడా స్టోరీ నచ్చినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఈ కాంబినేషన్ కనుక ఓకే అయితే క్రేజీ కాంబినేషన్ అయినట్టే. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం త‌ర్వాత మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డం.. టీజ‌ర్ అదిరిపోవ‌డంతో సినిమా కూడా దుమ్ము దులిపేస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

[youtube_video videoid=cfNa_HgvI9o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.