అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కబీర్ సింగ్. ఇక కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఆయన ఓ చిత్రం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఈ మూవీ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందట. ప్రస్తుతం చర్చల జరుగుతున్నాయట. అంతా ఓకే అయితే త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సల్మాన్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో “ఇన్షాఅల్లా” అనే మూవీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన ఇచ్చేశారు. అలియా భట్ హీరోయిన్ గా నటించనున్న ఈమూవీ వచ్చే సంవత్సరం రంజాన్ కానుకగా విడుదల కానున్నట్టు ముందే వార్తలు వచ్చాయి. ఒకవేళ సందీప్ వంగాతో సినిమా ఓకే అయితే అది ఈ ఏడాదే ప్రారంభమవుతుందో.. లేక “ఇన్షాఅల్లా” సినిమా తరువాత తీస్తారో చూడాలి. మరి సల్మాన్ ఖాన్ తో సినిమా తీస్తే సందీప్ రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=lG_Zw5fT5Jo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























