తెలుగు అర్జున్ రెడ్డి మానియా ఇప్పుడు కబీర్ సింగ్ తో బాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇక్కడ ఈ సినిమాతో సంచనం సృష్టించిన సందీప్ వంగా.. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా ఆదిత్య వర్మ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో బాలా దర్శకత్వంలో కొంత సినిమా చిత్రీకరించగా.. అది సరిగా రాలేదని మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. దానికి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే తెలుగు, హిందీ లో హిట్ అయినంత రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుందో..?లేదో..? తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పుడు కన్నడలో కూడా రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్ నారాయణ్ ఈసినిమా హక్కులను తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు సమాచారం. నటీనటులు వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. మొత్తానికి తెలుగు కల్ట్ హిట్ అర్జున్ రెడ్డి దేశ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసేట్టు కనిపిస్తోంది..
[youtube_video videoid=llV-auefhRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: