మూడు సినిమాల వరుస ప్లాఫ్స్ తరువాత ఇప్పటి వరకూ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు యంగ్ హీరో నితిన్. దాదాపు ఏడాది గ్యాప్ తరువాత భీష్మ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినా ఇప్పటివరకూ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాాగా ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు. “ఓ నూతన దినాన,ఓ కొత్త లుక్ లో ,ఓ కొత్త పాత్ర కోసం దాదాపు సంవత్సరం తరువాత కెమెరా ముందుకు వచ్చాను. ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది,భీష్మ షూటింగ్ బిగిన్స్” అంటూ ట్వీట్ చేశారు.
Almost after an Year I am back in front of the camera😎A new day, new look, a new character. Very Excited to kickstart this new journey… 😎
BHEESHMA shoot begins!!
@VenkyKudumula @iamRashmika @vamsi84 @SitharaEnts pic.twitter.com/tWY8oBWtZD— nithiin (@actor_nithiin) June 20, 2019
కాగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈసినిమాలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమెకి ఇది రెండవ సినిమా. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా నితిన్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[youtube_video videoid=QIam1ccIb6c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: