సూపర్ హిట్ మూవీ 118 తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా NKR 17 మూవీ ఈ రోజు ప్రారంభమయింది. సూపర్ హిట్ మూవీ శతమానం భవతి వంటి కథా చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ NKR 17 ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెడుతున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మిస్తున్న NKR 17 మూవీ లో మెహరీన్ కథానాయిక. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బాలగోపాలుడు మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన కళ్యాణ్ రామ్ అభిమన్యు మూవీ తో హీరోగా మారారు. సూపర్ హిట్ అతనొక్కడే మూవీ తో నిర్మాత అయ్యారు. అతనొక్కడే, పటాస్, జై లవకుశ వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించారు.
[youtube_video videoid=5WbPq3qjJHE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: