మహానటి సినిమా ఘన విజయం తరువాత తెలుగులో కీర్తి సురేష్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్ ఇటీవలే ఓ లేడి ప్రాధాన్యత ఉన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ మహానటి తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసింది. ఆమె మరో లవ్ స్టోరీకి ఓకే చెప్పేసినట్టుగా సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత వెంకీ అట్లూరి .. నితిన్ .. కీర్తి సురేశ్ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఈ సినిమా అటు నితిన్ కు, ఇటు కీర్తి సురేష్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో..
[subscribe]
[youtube_video videoid=j2EkC9psCA0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























