వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో హీరో కార్తీ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను చేసిన సినిమాల్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా.. డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఈ ఏడాది దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి ఇప్పుడు ఖైదీ అంటూ మరో విభిన్నమైన కథతో ముందుకొస్తున్నాడు. ఇటీవల పోస్టర్తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన యూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ను చూస్తే ఈసారి కార్తి హిట్ కొట్టడం ఖాయమనే అనిపిస్తుంది. ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న కార్తి… పక్కా మాస్ పాత్రలో మరోసారి ఇమిడిపోయాడు. డీ గ్లామరైజ్డ్గా ఉన్న ఈ పాత్రకు ప్రాణం పోసాడు కార్తి. మరి టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాను ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా…. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్.
వీటితో పాటు కార్తి మరికొన్ని సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో రష్మికా మందన కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాపనాశం తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ. జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=KPndTU16k7c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























