జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. బండ్ల గణేష్ నిర్మాతగా.. బోయపాటి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇప్పటికే బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తాను సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని.. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని ఇప్పటికే తన ట్విట్టర్ ద్వాారా క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో ఇంటర్వ్యూలో పాల్గొన్నపవన్ ను మళ్లీ రీ ఎంట్రీ పై.. బండ్లగణేష్ తో సినిమాతో పై అడుగగా.. పవన్ ఆ వార్తలను ఖండించినట్టు తెలుస్తోంది. తాను మళ్లీ సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని.. రాబోయే 25 ఏళ్లు ప్రజల కోసమే పనిచేస్తామని స్సష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని… ప్రజాసేవకే తన జీవితం అంకితమని స్పష్టం చేశారు. మరి పవన్ ఇచ్చిన క్లారిటీతో ఇకపై ఈ రూమర్స్ కు బ్రేక్ పడొచ్చేమో.. చూద్దాం ఏం జరుగుతుందో..?
[subscribe]
[youtube_video videoid=aTaO47Fsq9M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























