కెరీర్ ఆరంభంలో పలు సంవత్సరాల్లో ఏడాదికి రెండు సినిమాలతో పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. 2015 నుంచి ఏడాదికో చిత్రంతోనే సరిపెడుతున్నాడు. అయితే… 2020లో మాత్రం రెండు సినిమాలతో మరోసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడట ఈ సూపర్ స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘మహర్షి’ విజయంతో మంచి జోష్లో ఉన్న మహేష్… తన తదుపరి చిత్రంపై దృష్టి సారించనున్నాడు. ఎఫ్ 2
ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జూన్ నుంచి పట్టాలెక్కనుంది. డిసెంబర్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో పాటు గీత గోవిందం
ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడట మహేష్. ఆ సినిమాని 2020 మార్చిలో ప్రారంభించి… 2020 సంవత్సరాంతంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే… 2020లో మహేష్ నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశముందన్నమాట. ఇది మహేష్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే.కాగా… పరశురామ్ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
[subscribe]
[youtube_video videoid=MwdPdgEdTOc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: