ఒకప్పుడు తెలుగు టైటిల్స్‌తోనే అలరించిన నందమూరి బాలకృష్ణ… ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’… వంటి ఇంగ్లీష్ టైటిల్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. అంతేకాదు… తన అప్‌కమింగ్ మూవీకి కూడా ఇంగ్లీష్ టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితేనే ఈ సినిమాకు యాప్ట్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అంతేకాదు… ఈ సినిమాలో బాలయ్య లంచగొండి పోలీస్ అధికారిగా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా… ఈ నెల 17న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాని సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా… చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు. గతంలో బాలయ్య, రవికుమార్, సి.కళ్యాణ్, చిరంతన్ కలయికలో వచ్చిన ‘జై సింహా’ ఘనవిజయం సాధించడంతో… తాజా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[subscribe]
[youtube_video videoid=x_qQziabWAs ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: