మహేష్ బాబు అభిమానులకు మరో గుడ్ న్యూస్ లభించింది తెలంగాణ ప్రభుత్వం ద్వారా. ఇప్పటికే సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు ‘మహర్షి’ బుకింగ్స్ కి ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పెట్టేశాయి. ఇక ఈనేపథ్యంలో ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కు దృష్టిలో పెట్టుకొని ఐదు షోలకు అనుమతి ఇవ్వాలని కోరగా.. తెలంగాణ ప్రభుత్వం 5 షోలు వేసుకోవటానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభిమానులు తెలంగాణ ప్రభుత్వంపై హర్షం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=SVe_MFEHYOQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























