ఎట్టకేలకు అర్జున్ సురవరం సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎఫెక్ట్ వల్ల చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకోవాల్సివచ్చింది. ఫైనల్ గా ఈనెల 17వ తేదీన అర్జున్ సురవరం సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం యొక్క థియేట్రీకల్ హక్కులను ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది.
మరి కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కడ సూపర్ హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=nnl_cL9PZ8U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: