‘ఖుషి’… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలచిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే… కథానాయకుడిగా పవన్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా. ఆబాలగోపాలాన్ని అలరించిన ఈ స్టైలిష్ యూత్‌ఫుల్ మూవీకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. పవన్ కి జోడీగా భూమిక జంటగా నటించిన ఈ చిత్రంలో శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. కథను కీలక మలుపు తిప్పే పాత్రలో చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య కనిపిస్తాడు. తమిళ చిత్రం ‘ఖుషి’కి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మించాడు. అప్పట్లో మ్యూజికల్ గా సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాకి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరాలను అందించాడు. మణి కంపోజ్ చేసిన పాటలన్నీ ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ముఖ్యంగా “అమ్మాయే సన్నగా” పాటైతే ఇప్పటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’… నేటితో 18 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఖుషి’ – కొన్ని విశేషాలు:
- పవన్‌కు డబుల్ హ్యాట్రిక్‌ను అందించిన చిత్రం ‘ఖుషి’. ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బద్రి’వంటి ఐదు వరుస విజయాల తర్వాత విడుదలైన ‘ఖుషి’తో పవన్ డబుల్ హ్యాట్రిక్ పూర్తిచేశాడు.
- పవన్, భూమిక జంటగా నటించిన ఏకైక చిత్రం. అలాగే… భూమిక కెరీర్లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ. అంతేకాదు… ఈ సినిమాతో బెస్ట్ యాక్ట్రస్‌గా తొలి ఫిలింపేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది భూమిక.
- పవన్, మణిశర్మ కలయికలో వచ్చిన తొలి చిత్రమిదే. ఈ సినిమాలోని పూర్తి స్థాయి హిందీ పాటగా అలరించిన “యే మేరా జహా” అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ‘ఖుషి’ తర్వాత పవన్, మణి కాంబినేషన్లో ‘గుడుంబా శంకర్’, ‘బాలు’, ‘తీన్మార్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి.
- పవన్, నిర్మాత ఎ.ఎం.రత్నం కలయికలో వచ్చిన తొలి చిత్రమిదే. మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వీరి కలయికలో వచ్చిన
బంగారంకూడా మరోసారి ఇదే వేసవిని టార్గెట్ చేస్తూ విడుదల కావడం విశేషం. - పవన్, దర్శకుడు ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఖుషి’. తొమ్మిదేళ్ళ తర్వాత ఇదే కాంబోలో ‘కొమరం పులి’ రూపుదిద్దుకుంది.
- చిరంజీవి కెరీర్లో “వన్ ఆఫ్ ది హయ్యస్ట్ గ్రాసర్స్”గా నిలిచిన ‘చూడాలని వుంది!’ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం. అలాగే ఇదే నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘ఖుషి’ కూడా పవన్ కెరీర్లో “వన్ ఆఫ్ ది హయ్యస్ట్ గ్రాసర్స్”గా నిలవడం గమనార్హం. అలాగే… ఈ రెండు సినిమాలకూ మణిశర్మ సంగీతం అందించడం విశేషం.
[subscribe]
[youtube_video videoid=8tlOpcXojWM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























