మొన్నటి వరకూ హీరోయిన్ గా తన నటనతో మురిపించిన అమలాపాల్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతుంది. అనూప్ పానికర్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో కెడవర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేరళ పోలీస్‌శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ నిజజీవితంలో ఎదురైన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఫొరెన్సిక్ సర్జన్ గా నటిస్తోంది ఈ భామ. ఇక ఈ రోల్ కోసం హాస్పిటల్స్ చుట్టూ తెగ తిరుగుతూ… ఫోరెన్సిక్ ల్యాబ్ లో పనిచేస్తున్న వ్యక్తుల నుంచి ఎన్నో వివరాలు తెలుసుకుంటోందట ఈ మలయాళీ బ్యూటీ.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో అమలాపాల్ అటు హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయింది. ఇక ఈసినిమాకు ప్రొడ్యూసర్ గా మారడంపై.. ఎప్పటినుండో ఓ మంచి స్టోరీ దొరికితే చేయలనుకుంటున్నాను.. ఈనేపథ్యంలోనే ఈ సినిమా గత మూడేళ్ల క్రితమే వచ్చింది… నాకు చాలా నచ్చింది.. అనూప్ అండ్ టీమ్ గత మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారు.. ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కుతుంది.. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో తనే నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెబుతుంది అమలాపాల్. మరి నిర్మాతగా మారిన అమలా పాల్ కు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చుపెడుతందో చూద్దాం..
[youtube_video videoid=kEIc0l2N5pk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























