వినరా సోదర వీర కుమారా మూవీ తో యూత్ కు ఇచ్చిన సందేశాలు

7 Messages That Vinara Sodara Veera Kumara Movie Has Gave Us,7 Life Lessons One Should Learn From Vinara Sodara Veera Kumara,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vinara Sodara Veera Kumara Movie Latest Updates,Vinara Sodara Veera Kumara Movie Highlights,Vinara Sodara Veera Kumara Movie Latest News,Highlights Scenes From Vinara Sodara Veera Kumara Movie
7 Messages That Vinara Sodara Veera Kumara Movie Has Gave Us

ఆర్టిస్టుగా ‘ఊపిరి’, ‘గోల్కొండ హైస్కూల్‌’ వంటి చిత్రాల్లో నటించిన శ్రీనివాస్‌ సాయి హీరోగా.. ప్రియాంక జైన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టీనేజ్‌ లవ్‌స్టోరీ కథతో సతీష్‌చంద్ర దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా “వినరా సోదర వీర కుమారా”. లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈసినిమా ద్వారా యూత్ కు సతీష్ చంద్ర కొన్ని కీలకమైన విషయాలు కూడా చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పేరెంట్స్
వయసుకు వచ్చిన కొడుకుపై తల్లి దండ్రులు ఎలాంటి ఆశలు పెట్టుకుంటారో అన్న విషయం ఈసినిమాలో బాగా చూపించారు. చేతికి వచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందనే సందేశాన్ని చెప్పడంతోపాటు పిల్లలు కూడా ఎలా బాధ్యతగా ఉండాలన్నది కూడా ఆలోచింపజేసేదిగా ఉంటుంది.

ఫ్రెండ్ షిప్
ఫ్రెండ్‌ అంటే ఎలా వుండాలనేది కూడా సూరిపాత్ర ద్వారా చెబుతూనే.. ఎలా వుండకూడదో అనేది కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక ఫ్రెండ్ చివరి కోరికను మరో ఫ్రెండ్ తీర్చడంలో ఫ్రెండ్ షిప్ ప్రాముఖ్యత కూడా చూపించాడు. అలాగే కేవలం ఫీలింగ్స్, ఎమోషన్స్ మాత్రమే షేర్ చేసుకోవడం కాదు.. కరెక్ట్ డైరెక్షన్ లో నడిపించడం కూడా ఒక బాధ్యతే అన్న పాయింట్ చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

సూసైడ్
మరో ముఖ్యమైన పాయింట్ ప్రేమకోసం చంపడం, చావడం రెండూ తప్పే అనే పాయింట్‌ను స్ట్రెయిట్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. సూసైడ్ అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాదని… కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సూరి అనే క్యారెక్టర్ ద్వారా చూపించాడు డైరెక్టర్.

కమిట్ మెంట్
ఈ సినిమాలో గమనించాల్సిన ఇంకో విషయం కమిట్ మెంట్. ప్రేమించుకోవడం ముఖ్యం కాదు.. కమిట్ మెంట్ ఉండాలి. కమిట్ మెంట్ లేకపోతే ఏదీ మనకు దక్కదనే విషయాన్ని అర్థమయ్యేలా చూపించారు.

అండర్ స్టాండింగ్
లవ్ లో అండర్ స్టాండింగ్ కూడా ముఖ్యమే అన్న విషయాన్ని నేర్చుకోవాలన్న విషయం చూపించారు. లవ్ సక్సెస్ కాలేకపోయినా వారు లైఫ్ లో ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా హ్యాపీ గా ఉండాలన్న ఆలోచన కలిగిఉండాలని.. ఆ విషయంలో అండర్ స్టాండింగ్ కలిగి ఉండాలని చూపించారు.

సెల్ఫ్ మోటివేషన్
సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని యూత్ కు అర్ధమయ్యేలా చూపించాడు. మనలో ఉన్న మనో వేదనను.. మనలో ఉన్న డిప్రెషన్ ను ఎవరూ తీసేయలేరు.. మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలని.. మనమే మనలో ఆత్మ విశ్వాసాన్ని నింపుకోవాలన్న విషయాన్ని చూపించారు.

లైఫ్
ఫైనల్ గా జీవితంలో ప్రేమ అవసరమే కానీ…ప్రేమే జీవితం కాదు అన్న మెసేజ్ ను వినరా సోదర వీర కుమారా సినిమా తో యూత్ కు అర్థమయ్యేలా డైరెక్టర్ చూపించాడు. యూత్ లో ఉన్నప్పుడు ప్రేమ కలగడం అనేది సహజం.. అలా అని ప్రేమ సక్సెస్ కాకపోతే జీవితాన్ని నాశనం చేసుకోకుండా… ముందుకు సాగిపోతూ ఉండాలని రమణ క్యారెక్టర్ ద్వారా యువతకు అర్థమయ్యేలా చూపించారు.

ఓవరాల్ గా ఈ సినిమాకు కేవలం యూత్ మాత్రమే కాదు… ప్రతి తల్లిదండ్రులకు కూడా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. మరి మీరు కూడా “వినరా సోదరా వీర కుమారా సినిమా చూసి ఎంజాయ్ చేయండి…

[subscribe]

[youtube_video videoid=6pBQ9CNemvU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.